జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బుధవారం పట్టపగలే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపెల్లి లింగవ్వ అనే వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు నగలను దొంగిలించారు. ఒక యువకుడు వాహనంపై ఉండగా, మరో యువకుడు వృద్ధురాలితో మాట్లాడి నగలను ఎత్తుకుపోయాడు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మేడిపల్లి భీమారంతో పాటు జగిత్యాల టౌన్,రూరల్ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.