గత ప్రభుత్వం పదేళ్లుగా ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని డేగబాబు ఫంక్షన్ హాల్ మోతె మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు