వైసీపీ నాయకుడిని పరామర్శించిన బుట్టా రేణుక..ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురంలో వైసీపీ నాయకుడు బోయ పరమేశ్ను వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, సీనియర్ నాయకుడు బుట్టా శివనీలకంఠ ఆదివారం పరామర్శించారు. ఇటీవల బోయ రమేశ్ తల్లి లక్ష్మమ్మ అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకుని పరమేశ్ను బుట్టా రేణుక పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మనోధైర్యాన్నిచ్చారు.