ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని PDSU ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ కోరారు. కళాశాల బంద్ మూలంగా విద్యార్థుల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల ఎన్ ఆర్ భవన్ లో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో, తమ కళాశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయన్నారు. కాలేజీల బంద్ వల్ల విద్యార్థుల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.