ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందించే విధంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.సోమవారం భద్రాచలం ITDA సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.