నిజాయితీగా విధులు నిర్వహించాలని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ బి. అనురాధ పోలీస్ అధికారులతో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఏసిపిలను. సీఐలను, అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. కేసులలో శిక్షల శాతం పెంచాలని, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ముఖ్యం అన్నారు. పెండింగ్ ఉన్న కేసులపై దృష్టి సారించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై మరింత నిఘా పెంచి గంజాయి రహిత జిల్