బాపట్ల పట్టణంలో శనివారం బాపట్ల పట్టణ సీఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. పాత బస్టాండ్ సెంటర్లో ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డుపై నిలపకుండా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వీధి వ్యాపారులు రోడ్లపైకి రాకుండా నిర్దేశించిన ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.