ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ధైర్యంగా ఉండాలన్నారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి లు అంతక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన