అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమకు యూరియా పంపిణీ చేయాలని స్థానిక రైతు సేవ కేంద్రం ( ఆర్ ఎస్ కె )వద్ద గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరసాపురం గ్రామపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా గ్రామానికి చెందిన రైతులకు అధికారులు యూరియా పంపిణీ చేయకపోవడం ఏమిటని ఆర్ ఎస్ కె నిర్వాహక అధికారులను నిలదీశారు. ఆర్ఎస్ కె కేంద్రం వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తూ భీష్మించుకుని కూర్చున్నారు. త్వరితగతిన యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు తెలపడంతో వారు శాంతించారు.