కాగజ్ నగర్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి పోడు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హెల్త్ బులిటెన్ ప్రభుత్వ వైద్యుడు శ్రీధర్ విడుదల చేశారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని, యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయని, దాదాపు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ చేంజ్ అవుతున్నాయని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇలాగే దీక్ష కొనసాగితే మరింత ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శ్రీధర్ తెలిపారు,