భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొబ్బరి చెట్టు మహేందర్(40), గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతుండగా.. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా.. గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతదేహాన్ని జక్కాపూర్కు తీసుకురాగా, భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కావ్య (33) జీవితంపై విరక్తి చెంది రాత్రి పురుగుల మందు సేవించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిప