రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, నర్మల ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టామని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టు నిండుకొని వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. అదే సమయంలో పశువులను మేపేందుకు ఐదుగురు కాపర్లు వెళ్ళగా అందులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మిగతా నలుగురు వాగులోని చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ఎన్టీఆర్ బృందాలు, జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో చిక్కుకున్