లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన సరిపల్లి ఏసు పాదం 48 కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. గురువారం అదే గ్రామంలో పామాయిల్ తోటలోపామాయిల్ గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలిసిన పోలీసులు గురువారం మధ్యాహ్నం 11:30 సమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు