అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన చీరాల పట్టణంలోని హారిస్ పేటలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది.స్థానికంగా ఇళ్ల మధ్యలో చెట్ల పొదలలో విగత జీవిగా ఓ వ్యక్తి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వగా .పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో మృతుడిని పేర్లి కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.