గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు సందర్శించి జ్వరం, ఇతర వ్యాదులతో ఆసుపత్రిలో చేరిన వారిని, ప్రసవం అయిన మహిళలను, పురిటి పిల్లలకు అందుతున్న వైద్యం గురించి వారిని కలిసి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 31న రాత్రి రెండు గంటలసేపు ఆస్పత్రిలో కరెంటు పోయిందన్నారు.