బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామస్తులు శుక్రవారం గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. అయితే, నిమజ్జనానికి డీజేకి అనుమతి లేదని చందోలు ఎస్సై శివకుమార్ నిర్వాహకులకు తెలిపారు. దీంతో నిర్వాహకులు పోలీసులతో ఘర్షణకు దిగి, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గ్రామ పెద్దలతో మాట్లాడి ఎస్సై ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.