పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో 4 రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంట్ వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ శిబిరాలను ఎత్తివేయాలని మండల రెవెన్యూ సిబ్బంది, పద్మనాభం పోలీసులు ఆ రోజుకు రెండు మూడు సార్లు శిబిరము వద్దకు వచ్చి శిబిరాన్ని ఎత్తివేసి పద్మనాభం తాసిల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.దీనికి రైతులు గ్రామంలోని తప్పనిసరిగా గ్రామ సభ పెట్టి రైతుల ఆమోదం గ్రామ పెద్దలు ఆమోదం తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.