చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో మనస్థాపం చెందిన ఓ వివాహిత పుంగమ్మ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరువులో చేపలు పడుతున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటన స్థలానికి బ్లూ కోర్ట్ సిబ్బంది రాజేష్, రియాజ్, చేరుకుని చేపలు పెడుతున్న వ్యక్తి సహాయంతో వివాహతను రక్షించి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వెలుగులో వచ్చింది.