మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభలో రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గడిచిన 10ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక చట్టాలు తీసుకువచ్చి పేదలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదలపై జీఎస్టీ భారం మోపి పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు.