ఉట్నూరు మండలంలో జిల్లా ఇన్చార్జి మంత్రిసీతక్క శనివారం సుడిగాలి పర్యటన చేశారు. శంభు గూడ నుంచి శివనూర్ గ్రామం వరకు 3 కోట్ల 24 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు, లక్కారం నుంచి చింతగూడ వరకు 8 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగూడ గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు.అనంతరం శ్యాంపూర్ లి 12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి , కోళ్లఫామ్, చెక్ డ్యాం, పొలంబాటల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన చేశారు.