మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని శనివారం సాయంత్రం ఉత్సవ కమిటీ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో నిమజ్జనానికి తరలించారు. ప్రస్తుత రోజుల్లో డీజే డాన్సులతో నిమజ్జనానికి తరలిస్తున్న తరుణంలో, ఇక్కడ నాదస్వరం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జనం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులను అభినందించారు.