శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా, బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.ముందుగా బ్రహ్మం సాగర్ పరిధిలోని ఆయాకట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో.. రిజర్వాయర్ లో నీటిమట్టం, స్టోరేజీ కెపాసిటీ, కుడి ఎడమ కాలువల స్థితిగతులపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్.అనంతరం కుడి, ఎడమ కాలువల్లో నీటి ప్రవాహం, కాలువల మరమ్మతులు, ఆయకట్టుకు అవసరమైన నీటి లభ్యత.. మొదలైన వివరాలను చర్చించిన జిల్లా కలెక్టర్.