అశ్వారావుపేట మండల కేంద్రంలో లక్ష్మీ ప్రసన్న అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ ప్రసన్న ఇంట్లో పని చేస్తుండగా జారిపడి గాయపడిందని ఆమె భర్త నరేష్ బాబు రాజమండ్రి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు.. ఆమె ఒంటిపై గాయాలను గమనించిన తల్లితండ్రులు నరేష్ బాబు అతని బంధువులు మరో ముగ్గురుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..