పలమనేరు: మున్సిపల్ పరిధిలోని భజంత్రి వీధిలో గల 5వ నెంబర్ చౌకదుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు టిడిపి నేతలు ఎమ్మెల్యేకు గౌరవ మర్యాదలతో ఘనంగా స్వాగతం తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్ సునీత నాగరాజు, టౌన్ టిడిపి అధ్యక్షుడు బలరాం, టిడిపి నేతలు గిరి, సుబ్రహ్మణ్యం గౌడ్, తదితర ప్రధాన నాయకులు కార్యకర్తలు మరియు ఎంపీడీవో భాస్కర్, ఎంఆర్ఓ ఇన్భనాధన్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.