రెడ్డిపాలెం- ఖాజీపాలెం రహదారిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.బుద్దాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా సరుకులతో వెళుతున్న టాటా ఏసీ వాహనం రాంగ్ రూట్లో వచ్చి ఢీకొంది.దీంతో శ్రీనివాస్ కాలి వేళ్ళు తెగిపోయాయి.స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వచ్చి అతడిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు విచారణ చేపట్టారు.