కావలి ఆర్టీసీ బస్టాండ్లో బీజేపీ ఒకటో పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ ఆధ్వర్యంలో బుదవారం స్వచ్ఛత హీ సేవ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రెండో పట్టణ అధ్యక్షుడు కుట్టు బోయిన బ్రహ్మానందం, పలువురు నేతలు చీపురు పట్టి బస్టాండ్ పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.