వినాయక నిమజ్జనం సందర్భంగా తమపై అకారణంగా దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీబీగూడెంకు చెందిన బాధితుడు హెచ్.ఆర్.నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీగూడెంలో మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ లత రాజు నిమజ్జన కార్యక్రమంలో తమపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేసి, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.