యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి లక్ష్మీదేవి కాల్వ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బుధవారం ఉదయం 11 గంటలకు డిమాండ్ చేశారు. అంజయ్య కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఎమ్మెల్యే మందుల సామేలు పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే నిరంతరం అభివృద్ధి చేస్తున్నారన్నారు.