మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అలా చేస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని రెండో పట్టణ సీఐ కాళీ చరణ్ అన్నారు. భీమవరం రెండో పట్టణంలోని పద్మాలయ థియేటర్ సెంటర్లో ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు.