ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పి.జి.అర్.ఎస్.) లో వచ్చిన అర్జీలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ MN హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పి.జి.అర్.ఎస్. కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి సత్వరమె చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదన్నారు.