యూరియాను అధిక మోతాదులో వాడరాదని, యూరియాను వాడేటప్పుడు తగిన సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్, వి.ఐఏఎస్ సూచించారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత పథకము సౌజన్యంతో పంటల వారిగా సిఫారసు చేయబడిన యూరియా మోతాదుకు సంబంధించిన పోస్టర్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పంటలకు యూరియాను వాడేటప్పుడు అందులో నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, వివిధ రూపాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించడానికి వ్యవసాయ శాఖ తెలిపిన సూచనలు పాటించాలన్నారు.