ధర్మవరం పట్టణం చంద్రబాబు నగర్ కు చెందిన పల్లవి (23) అనే యువతి అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పల్లవి తండ్రి బాలు నాయక్ మాట్లాడుతూ పల్లవి ఎంబీఏ చదువు పూర్తి చేసుకుని సరైన ఉద్యోగం రాక మదన పడుతూ ఉండేదని ఇటీవల అనారోగ్యంతో సైతం బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.