అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాల నుంచి తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు ట్యాంకుల ద్వారా మంచినీటిని తెచ్చుకుంటున్నారు. తాగునీటి కోసం డబ్బులు కూడా ఇచ్చామని అయినా నీటిని సరఫరా చేయడం లేదని గ్రామస్థులు తెలిపారు. ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకోవడానికి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.