రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను తక్షణమే ఆదుకోవాలని పిఠాపురం టౌన్ సీపీఐ కార్యదర్శి సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులను అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని ఆయనఆవేదన వ్యక్తం చేశారు. ఏ పథకం ప్రవేశపెట్టినా ఎవరికీ నష్టం కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో కార్మికులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు.