నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలోని కో ఆపరేటివ్ బ్యాంకులో నిన్న జరిగిన కిలాడీ లేడీల చోరీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఓ వ్యక్తి గోల్డ్ లోన్ చెల్లించేందుకు బ్యాంకుకు రాగా కిలాడి లేడీ ముఠా చోరీ చేసి చాకచక్యంగా రూ.3 లక్షలను కాజేశారు. కాగా అఖిలాడి లేడీ గ్యాంగ్ ను పోలీసులు వాహన తనిఖీలలో పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఏడుగురు సభ్యుల ముఠా అమాయక ప్రజలను మాయమాటల్లో పెట్టి బ్లేడులతో జేబులు, కవర్లు కట్ చేసి డబ్బులు దోచుకుంటుందని, దొంగిలించిన నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.