నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం - 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందగా డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన నర్సింహరెడ్డిగా గుర్తించారు.