గార్ల మండలంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గార్ల నుండి బయ్యారం వెళ్లే దారిలో చంద్రగిరి వెళ్లే కూడలి వద్ద చెప్పులు చీరలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలను భయాందోలనకు గురిచేస్తున్న వారిని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.