చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాంపల్లి గ్రామ సమీపంలో నేతగుట్లపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న షేర్ ఆటోకు కుక్కలు గుంపు దూరడంతో షేర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న నేతగుట్లపల్లి గ్రామానికి చెందిన ఈరమ్మ, మహేశ్వర, ఈశ్వరమ్మ, మోదగులపల్లి గ్రామానికి చెందిన ముని వెంకటమ్మ, గంగులమ్మ గాయపడ్డారు. గాయపడ్డ వారిని షేర్ ఆటోలో పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఘటన సోమావారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.