కామారెడ్డి : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన ఆదివారం కామారెడ్డి మండలం నరసన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. నరసన్న పల్లి గ్రామానికి చెందిన చిదుర రాజిరెడ్డి (52) సంవత్సరాలు, తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా విద్యుత్ వైర్లు ట్రాక్టర్ సైలెన్సరు తగిలాయి. దీంతో రాజిరెడ్డి ట్రాక్టర్పైనే కుప్ప కూలి మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ నిలిపివేసి ట్రాక్టర్ ను రాజిరెడ్డిని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.