నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని పెన్ను క్యాప్ పై మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్ తో 60 సూక్ష్మ వినాయకులను వివిధ రూపాలతో 2 గంటల వ్యవధిలో అద్భుతమైన చిత్రాన్ని వేసి అబ్బుర పరిచారు.ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుండి ప్రతి వినాయకచవితి పండుగకు గణేశుని చిత్రాలను వేస్తున్నాను అని తెలిపారు.ఈ సారి పెన్ను క్యాప్ పై సూక్ష్మ వినాయకులను వేశానన్నారు. ఈ చిత్రంలో గణనాధుడు భక్తులకు అభయ మిస్తున్నట్లు,ఓం, శంకు ఆకారంలో గణేశుడు, కాణిపాకం, త్రిముఖ, నాట్యభంగిమ అనేక రూపాల్లో వేశారు.