రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ గురువారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ఎస్పీ మహేష్ బి.గీతే, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం మరింత వర్షం భారీగా కోవడంతో రోడ్లపైకి వర్షం నీరు చేరింది. ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విద్య సంస్థలన్నిటికీ కలెక్టర్ సెలవు ప్రకటించారు.