గత రెండు రోజుల క్రితం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన ఫిర్యాదుల మేరకు టేకులపల్లి పోలీసులు మరియు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఉన్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వీరి వద్ద నుండి 12 సెల్ ఫోన్లు బ్యాంకు బుక్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు..