కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న యువకులను లారీ వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకొని గాయాలు అయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన శివకుమార్, సంజీవులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.