బైరెడ్డిపల్లి: మండలం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు, దేవదొడ్డి గ్రామం సమీపంలో ఉన్న కైగల్ జలపాతం పొంగిపొర్లుతోంది. కొన్ని నెలలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నా కైగల్ వాటర్ ఫాల్స్ కు మాత్రం నీరు చేరలేదు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ జలపాతం ఒకప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండేది. పోలీసుల ఆంక్షలు, కొన్ని ప్రమాదాల నేపథ్యంలో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడికి కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు, సంబంధించిన అధికారులు దృష్టి పెడితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.