అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారంమూడు గంటల పది నిమిషాల సమయంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఉపకులపతి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు రామ్మూర్తి జయంతిని ఆగస్టు 29న జయంతిలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత రావడానికి ఆయన రచించిన అనేక పుస్తకాలే ఆదర్శమని అటువంటి రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా జయంతిగా నిర్వహించుకోవడం శుభ పరిణామం అని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.