శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న చిలమత్తూరు మండలం మరువ కొత్తపల్లికి చెందిన మోహన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు