గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు నిబంధనలు పాటించాలని కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ సూచించారు. గురువారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్లో అన్ని గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి పది గంటల తర్వాత సౌండ్ సిస్టం వాడొద్దన్నారు. వినాయక మండపాల వద్ద రిజిస్టర్ ఏర్పాటు చేస్తే తనిఖీలకు వచ్చిన పోలీసు అధికారులు సంతకాలు చేస్తారన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ వినోద్ ఉన్నారు.