సంతనూతలపాడు ప్రభుత్వ వైద్యశాలను మండల ప్రత్యేక అధికారి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీహరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రిలో నమోదవుతున్న ఓపిల వివరాలు అడిగి తెలుసుకుని, ఓపీల శాతాన్ని ఇంకా పెంచాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు మౌలిక వసతుల పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.