శ్రీకాకుళం జిల్లా కొత్తవలసలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ దళిత, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ దాడిని ఖండించిన నాయకులు జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అట్టడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు.