గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వ తేదీ వరకు జరిగే గాలికుంటు వ్యాధి నిరోధిక టీకాల కార్యక్రమ బ్రోచర్ ను గురువారం రాత్రి 7 గంటలకు ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. 4 నెలల దాటిన ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జవర్ హుస్సేన్ పాల్గొన్నారు.